ఆ గొప్ప జీఎన్ రావు ఒక అసెంబ్లీ సెషన్ వైజాగ్ లో అని చెప్పారు.. ఇది వింటే పిల్లవాడు కూడా నవ్వుతాడు: సుజనా చౌదరి

27-12-2019 Fri 13:13 | Andhra
  • మూడు రాజధానులు అనే అంశమే హాస్యాస్పదం
  • హైకోర్టు వచ్చినంత మాత్రాన ఆ ప్రాంతాన్ని రాజధాని అని అనరు
  • 7 నెలల్లో పరిపాలనపై వైసీపీ శ్రద్ధ చూపించిన పాపాన పోలేదు
రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనేదే బీజేపీ ఆకాంక్ష అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. బీజేపీ తరపున తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు మౌనదీక్ష కూడా చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని అన్నారు. వారికి కావాలనుకుంటే జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ ను వారి ఇష్టానుసారం మార్చుకోవచ్చని, కార్పొరేట్ ఆఫీసును రాష్ట్రంలో ఎక్కడికైనా మార్చుకోవచ్చని... రాజధానిని కూడా వారు కార్పొరేట్ సంస్థగా భావిస్తున్నట్టున్నారని దుయ్యబట్టారు. హైదరాబాదులో రాష్ట్రపతి కోవింద్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మూడు రాజధానులు అనే అంశమే హాస్యాస్పదమని సుజనా చౌదరి ఎద్దేవా చేశారు. హైకోర్టు వచ్చినంత మాత్రాన ఆ ప్రాంతాన్ని ఎవరూ రాజధాని అనరని... 30 రోజులు మాత్రమే అసెంబ్లీ జరిగే ప్రాంతాన్ని కూడా రాజధాని అనరని చెప్పారు. ఆ గొప్ప జీఎన్ రావు గారు ఒక సెషన్ (బడ్జెట్ సెషన్) వైజాగులో అంటూ నివేదికలో చెప్పారని విమర్శించారు. రెండేళ్ల వయసున్న పిల్లవాడు కూడా ఇది వింటే నవ్వుతాడని అన్నారు.

వైసీపీ వాళ్లు ఆరోపించే విధంగా తాను ఆరోపణలు చేయలేనని... వైజాగ్ లో వాళ్లు భూములు కొనుక్కుంటే కొనుక్కుని ఉండవచ్చని సుజనా చౌదరి అన్నారు. రాజధానిపై వారి నిర్ణయాన్ని మాత్రం తప్పుబడుతున్నానని... ఇది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? అని ప్రశ్నించారు. హైకోర్టును మార్చడం కూడా అనుకున్నంత సులువు కాదని... దీనికి కొలీజియం, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఆమోదం కావాలని అన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని చెప్పారు. ఈ 7 నెలల్లో పరిపాలనపై వైసీపీ శ్రద్ధ చూపించిన పాపాన పోలేదని విమర్శించారు. రాజకీయ దుర్భాషలకే ప్రాధాన్యతనిచ్చారని అన్నారు.
Sujana ChowdaryBJPYSRCP

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more